Skip to playerSkip to main content
  • 21 minutes ago
కార్తికమాసం మొదటి సోమవారం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైనా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలగించి పూజలు చేశారు. తణుకు గోస్తనీ నదీ తీరాన ఉన్న శ్రీ సిద్ధేశ్వర, శ్రీ సోమేశ్వర, శ్రీ కపర్థీశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోనసీమ జిల్లా అమలాపురం, పి.గన్నవరం, మురమళ్ల, అంతర్వేది, కడలి, పలివెల ప్రాంత శివాలయాల్లో కోలాహలం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివనామస్మరణతో కళకళలాడుతున్నాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని త్రేతా యుగం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఉండ్రాజవరం శ్రీ గోకర్ణేశ్వర స్వామిని కార్తిక సోమవారం రోజున దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగునని భక్తులు విశ్వసిస్తారు. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అటు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తజనం అధిక సంఖ్యలో వచ్చారు. వేలాది మంది భక్తులు ఆదివారం రాత్రే కొండపైకి చేరుకున్నారు. రాత్రి ఒంటి గంట నుంచే వ్రతాలు, దర్శనాలను ఆలయ అధికారులు ప్రారంభించారు. రామోజీరావు జయంతి - ఆయన సేవలు, ఆశయాలను స్మరించుకున్న సీఎం, మంత్రులుఏపీకి 'అక్వాన్' తుపాను ముప్పు - 145 కి.మీ వేగంతో పెనుగాలులు

Category

🗞
News
Transcript
00:00I don't know what to do
00:29Bye-bye.
01:07Bye-bye.
01:29Bye-bye.

Recommended