Skip to playerSkip to main content
  • 28 minutes ago
బీఆర్కే భవన్​లో సీఈవో సుదర్శన్ రెడ్డితో టీఆర్ఎస్​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలని, నామినేషన్లు వేసే వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని సీఈవోను కోరినట్లు కవిత తెలిపారు. రిజిస్ట్రేషన్ ఈ నెల 6 వరకు ఉందని, ఎస్ఐఆర్ ప్రక్రియనే ఈ నెల 21వరకు ఉన్నందున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్​ను కూడా పొడగించాలన్నారు. దీనికి సీఈసీ సానుకూలంగా స్పందించారన్నారు. మాలాంటి కొత్త పార్టీలకు ఎజెండా చెప్పుకునేందుకు ఇదొక అవకాశం అని పేర్కొన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రభుత్వం పనితీరు, ప్రతిపక్షాల తీరు తెన్నులను గమనించి గ్రాడ్యుయేట్లు ఓటు వేస్తారన్నారు. జెన్​జీ సహా గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికలను సీరియస్​గా తీసుకోవాలని అదే విధంగా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.తెలంగాణ రక్షణ సేన రిజిస్ట్రేషన్ పనులు దిల్లీలో పెండింగ్​లో ఉందన్నారు. తాము ఎంత పెద్ద ఎత్తున పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ కమిటీలు వేసి పని చేస్తున్నామో రాష్ట్ర ఎన్నికల అధికారిని గమనించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దిల్లీలో మా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర సీఈవో తరఫున నివేదిక ఇవ్వాలని కూడా ఆయనను కోరినట్లు వెల్లడించారు. పెద్ద పెద్ద విద్యా సంస్థల వాళ్లు పోటీ చేస్తూ వారి విద్యార్థుల ద్వారా ఎన్నికలను బయాస్డ్​గా మారుస్తున్నారని, ఈ విషయాన్ని ఎన్నికల తర్వాత ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Category

🗞
News
Transcript
00:15S.A.R.A.C.E.L.A.C.E.R.

Recommended