Skip to playerSkip to main content
  • 7 minutes ago
Amadalavalasa Road Accident : నిత్య జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరీ ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. మనం బాగానే డ్రైవింగ్ చేస్తున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని నడుపుతున్నారో చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవడంతో పాటు మరికొందరు బాధితులుగా మారుతున్నారు.తాజాగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కొత్తకోట వారి వీధి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆటోను పైకి లేపి అందులో ఉన్న ప్రయాణికులకు బయటకు తీశారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయం కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.దీనిపై సమాచారం అందుకున్న ఆమదాలవలస ఎస్సై బాలరాజ్​ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడివి సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

Category

🗞
News
Transcript
00:00Music
00:07Hey Swami!
00:10Side, side, side
00:42Yes, Swami, come on, come on.

Recommended