Skip to playerSkip to main content
  • 19 minutes ago
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో పర్యటించారు. అదే గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గోరిపల్లి సుమిత్ర - శ్రీనివాస్ దంపతుల నూతన గృహాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహూకరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కుటుంబంతో కలిసి వారి ఇంట్లోనే భోజనం చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యంతో చేసిన వంటకాలను ఆయన ఆరగించారు. సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ధనసరి సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంట్లోనే భోజనం చేశారు. "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్న చిన్నారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 

Category

🗞
News
Transcript
00:00What

Recommended