Youth Service At Immersion : పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ నగర యువత ముందుకొచ్చింది. గణపతిని నిమజ్జనం చేసే సమయంలో పూలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ కవర్లను నేరుగా నీటిలోనే వేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను ముందే గుర్తించిన యువతీ, యువకులు వినయ్, అభిషేక్, ఉషతోపాటు మరికొంత మంది బృందంగా ఏర్పడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాత్రింబవళ్లు శ్రమిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిమజ్జనం మూడోరోజు నుంచే పీపుల్స్ ప్లాజా వద్ద ప్రత్యేక శిబిరాన్నిఏర్పాటు చేశారు. ప్రతి వాహనం వద్ద స్వయంగా సేకరించిన వ్యర్థాలను పూలు, ఆకులు, ప్లాస్టిక్ కవర్లుగా విడదీసి డ్రమ్ములలో భద్రపరుస్తున్నారు. వీటిని జీహెచ్ఎంసీ సిబ్బందికి అందజేస్తున్నారు. నిమజ్జనం మన సంస్కృతిలో భాగమే కానీ నీటి వనరులను కలుషితం చేయకూడదు అనే స్పృహను కలిగిస్తున్నారు. ఫ్లెక్సీలతో పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. వారంలో 10టన్నుల పూలు, పత్రాలు, టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను జీహెచ్ఎంకీ అప్పగించినట్టు వారు తెలిపారు.