Skip to playerSkip to main content
  • 5 days ago
IT Employees Voluntary Service : పర్యావరణ పరిరక్షణలో 'మేము సైతం' అంటూ ఐటీ ఉద్యోగులు ముందుకొచ్చారు. ‘వరల్డ్‌ క్లీనప్‌ డే’ను పురస్కరించుకొని ఈ నెల 16 నుంచి కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రమదానం చేపడుతున్నారు. గణేశ్ నిమజ్జనం తర్వాత నదుల్లో, వాగుల్లో పేరుకు పోయిన వ్యర్థాలను శుభ్రం చేసే దిశగా ఆదిలాబాద్​లోని ఐటీ ఉద్యోగులు నడుం బిగించారు. ఆదివారం ఎన్​టీటీ డాటా సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు పట్టణ శివారులోని చాందావాగులో చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. గణేశ్‌ నిమజ్జనంతో పేరుకు పోయిన పరిసరాల్లోని చెత్త, ప్లాస్టిక్‌ను సుమారు 40 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని తొలగించారు. ప్లాస్టిక్, చెత్తను ఒకచోట పోగు చేసి రీసైక్లింగ్‌కు పంపిస్తున్నట్లు వారు తెలిపారు. కార్పొరేటివ్ సామజిక బాధ్యత కింద సెలవు రోజున వ్యర్థాలు తొలగించినట్లు వారు తెలిపారు. వచ్చే ఏడాదయినా మట్టి విగ్రహాలు ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఉద్యోగులు కోరారు.

Category

🗞
News

Recommended