Skip to playerSkip to main content
  • 17 minutes ago
PYDITHALLI JATARA 2026 : ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం వైభవంగా జరుగుతోంది. మాన్సాస్‌ ట్రస్టు తరఫున పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుమార్తెలు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విద్యావతి దేవి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా కోటలోని ఆంజనేయస్వామి, లక్ష్మీదేవి ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించి పూజలు చేశారు. అనంతరం పైడితల్లిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు విజయనగరం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు అదితి గజపతిరాజు తెలిపారు. ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. పైడితల్లి అమ్మవారి నామ స్మరణతో విజయనగరం జిల్లా కేంద్రం మారు మోగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఘటాలు సమర్పించుకొని పూజలు చేస్తున్నారు. పైడితల్లిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

Category

🗞
News
Transcript
00:08Music
00:37I don't know what to do.
01:21This is the first time I was able to get to the same place,
01:25and I am able to get to the same place.
01:27I am able to get to my own places.
01:28I am able to get to the same place as I have been able to get to the same place.
01:44Thank you very much.
02:01Thank you very much.

Recommended