Skip to playerSkip to main content
  • 15 minutes ago
Khairtabad Bada Ganesh Immersion : అశేష భక్త వాహిని జయజయధ్వానాల మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. 11 రోజుల పాటు భక్తులతో ధూపదీప నైవేద్యాలందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడిని చేరుకున్నాడు. ఈ క్రతువును చూసేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హైదరాబాద్​ నగరం జనసంద్రంగా మారింది. తొలుత బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపంతో బడా గణేశ్​ టస్కర్‌పైకి ఆలస్యంగా చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర, క్రేన్​లో సమస్య కారణంగా 3 గంటల ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమైంది. 'జై బోలో గణేశ్​ మహరాజ్ ​కీ జై' అంటూ భక్తుల జయజయధ్వానాలు మార్మోగాయి. అశేష భక్తజనావళి నినాదాల మధ్య ఆ గణనాథుడు గంగమ్మ ఒడిని చేరాడు. బడా గణేశ్​ శోభాయాత్ర ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. భక్తులు గణనాథుడిపైకి పుష్పాలు చల్లుతూ, డోలు వాయిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended