50 Different Types Of Sweets in konaseema District: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువులోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా గ్రామాల్లో నిర్వహించే అన్న సమారాధనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఒక్కో ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రామస్థులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరి ప్రజలందరికీ విందు భోజనం అందించారు. ఈ విందులో ప్రత్యేకత ఏమిటంటే సుమారు 50 రకాల స్వీట్లు, పిండివంటలతో అన్న సమారాధన నిర్వహించారు. అయితే ప్లాస్టిక్ ప్లేట్లు వినియోగించకుండా కోనసీమలో విరివిగా దొరికే అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించారు. భోజనానికి ముందు వరుస క్రమంలో ఆ అరటి ఆకుల్లో మిఠాయిలు వడ్డించారు. అన్న సమారాధనలో కూర్చున్న వారు ఒకవేళ అన్ని రకాల మిఠాయిలను తినలేకపోతే, ఇంటికి తీసుకెళ్లేందుకు వారికి ప్లాస్టిక్ కవర్లు కూడా అందజేశారు. ఈ అన్న సమారాధనతో గ్రామంలో సందడి చోటు చేసుకుంది.