Skip to playerSkip to main content
  • 3 minutes ago
Varuna Yaga For The Fall OF Rains In Anantapur District : అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరవకొండ గవిమఠంలో వరుణ యాగ సహస్రఘటాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. లోకకల్యాణార్థం, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో ఆలయ అర్చకులు, అధికారులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచే మఠంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీగణపతి పూజ, వరుణ జపం, వరుణ యాగం, సహస్రఘటాభిషేకం, పూర్ణహుతి పూజలను ఘనంగా పూర్తి చేశారు. యాగం ముగిసిన అనంతరం ఆలయంలోని శివలింగానికి అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ విశేష పూజలను చూసేందుకు స్థానిక భక్తులు వచ్చారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలనే ముఖ్య సంకల్పంతో ఈ వరుణ యాగం నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి తెలిపారు. వర్షాలు బాగా పడితేనే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని, అందుకే స్వామివారి సన్నిధిలో ఈ ప్రార్థనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:11Transcription by CastingWords
Comments

Recommended