A Python Entered Into House : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. యాదగిరిపల్లి నుండి మైలార్గూడెం వెళ్లే రహదారిపై మొదట కనిపించిన ఈ భారీ కొండచిలువ, ఆ తర్వాత నెమ్మదిగా కాలనీలో శివారులో ఉన్న రాచకొండ రాజు అనే వ్యక్తి ఇంట్లోకి దూరినట్లు గమనించిన స్థానికులు చెపుతున్నారు. కొండచిలువ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన పొరుగు వ్యక్తి వెంటనే రాజు కుటుంబానికి సమాచారం అందించాడు. రాత్రివేళ ఇంటి పరిసరాల్లో కొండచిలువ కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖాధికారులకు, స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. సుమారు 9 నుండి 12 అడుగుల పొడవున్నకొండచిలువను సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేశారు. దీంతో రాజు కుటుంబీకులు, స్థానికులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. నివాసాల్లో పాములు కనిపిస్తే భయాందోళన చెందకుండా, వాటికి హాని చేయకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.