• 11 minutes ago
Koti Vattika Deepotsavam at Dokiparru : కార్తికమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు, దీపారాధన, దానధర్మాలు, భగవన్నామస్మరణకు విశేష ప్రాధాన్యం ఉంది. కార్తిక మాసంలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అజ్ఞానమనే తిమిరం నుంచి జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే సాధనమే దీపం. కార్తిక మాసంలో దేవుని సమక్షంలో, ఇంటి గుమ్మాల ముందు, తులసి కోట వద్ద, దేవాలయాల్లో దీపాలు వెలిగించడం మన సంప్రదాయం. అందుకే గృహాలు, ఆలయాలు దీపాల వెలుగులతో శోభిల్లుతుంటాయి.ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. భూసమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోటి వత్తుల దీపోత్సవం కనుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. దీంతో ఆలయ ప్రాంగణం నూతన శోభను సంతరించుకుంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల పర్యవేక్షణలో ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. మహాక్షేత్రంలో నిత్యం నిర్వహించే పూజలతోపాటు పక్ష, మాస, అర్ధవార్షిక, వార్షిక ఉత్సవాలను ఆలయ ధర్మకర్తలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.

Recommended