Gold plating for Simhadri Appanna’s Dhwajasthambham : ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం స్వర్ణ తాపడం పనులు పూర్తయ్యాయి. ధ్వజస్తంభం పీఠానికి కోటి 20 లక్షలతో విశాఖకు చెందిన సీఎంఆర్ టెక్స్ టైల్ అండ్ జువెలరీ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ బంగారం తాపడం చేయించారు. గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అర్చకులు ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభం పీఠానికి ప్రోక్షణ జరిపించారు. ధ్వజస్తంభం పీఠానికి 509 గ్రామాల బంగారంతో రాగిరేకులపై స్వర్ణతాపడం చేయించినట్లు వెంకటరమణ తెలిపారు. తయారీ సంస్థ తాపడం పనులకు 25 ఏళ్ల వారంటీ ధ్రువపత్రం జారీ చేసిందన్నారు.రెండేళ్ల క్రితం సీఎంఆర్ సంస్థవారే ధ్వజస్తంభానికి స్వర్ణతాపడం పనులు చేయించారు. సుమారు రెండు, కలిపి నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు సమాచారం. గతంలో సుమారు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఖర్చుతో ధ్వజస్తంభానికి (1802.200 గ్రాములతో) కూడా బంగారు తాపడం పనులు చేయించారు. ప్రస్తుతం పీఠం తయారీకి ఒక కోటి 20 లక్షలు ఖర్చయినట్లు సీఎంఆర్ టెక్స్ టైల్ అండ్ జువెలరీ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు.