• 10 minutes ago
ప్రభుత్వానికి విన్నపించారు. పట్టించుకోలేదు. ఫలితం లేదని తామే నడుంబిగించారు. పక్షం రోజులు శ్రమించి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి-పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల చెక్ డ్యామ్ గతేడాది నంబరు 25న కూలిపోయింది. దీంతో మానేరు నదిపై ఉన్న ఆ చెక్ డ్యాంపై ఆధారపడ్డ రైతులకు సాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రభుత్వాన్ని సహాయం కోరితే ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిధిలో జమ్మికుంట, ఓదెల మండలానికి చెందిన 800 ఎకరాల ఆయకట్టు ఉంది. శంభునిపల్లి ప్రాంతంలోనే 300 ఎకరాల దాకా ఆయకట్టు ఉంది. దీంతో ఆయకట్టు రైతులంతా ఏకమయ్యారు. ఎకరానికి  5వేల చొప్పున రైతుల నుంచి పోగు చేశారు. చెక్ డ్యామ్ కూలిన ప్రాంతంలో సిమెంట్ దిమ్మెలు, సిమెంట్ కట్టవేశారు. రాళ్లు అడ్డుగా వేశారు. ఇసుక, గడ్డికట్టలు, టార్పాలిన్లు  పోగు చేసుకున్నారు. భారీ యంత్రాలతో పాటు, రైతులు శ్రమదానం చేశారు. 15 రోజులు కష్టపడ్డారు.ఎట్టకేలకు చెక్ డ్యామ్ వద్ద నీరు వృథా కాకుండా ఒడిసి పట్టారు. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు చేసిన భగీరథ ప్రయత్నం ఫలించింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా  సాగు నీటి సమస్యను పరిష్కారం కోసం అన్నదాతల ఐక్యత ఆదర్శంగా నిలిచింది.

Category

🗞
News
Transcript
00:03પરભસ્વાની કી વિન્ણા વિના વિને ચારુ પરભુતવાની કી વિના વિને કીણા વિને કીણા વિંદે કેણા

Recommended