High Court Judge Visits Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు విశాఖపట్నంలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లెపల్లి వెంకటరావు స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న వారు, ముందుగా అక్కడ ఉన్న పవిత్రమైన 'కప్ప స్తంభాన్ని' స్పృశించి, ఆ తర్వాత గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రాలను పఠించి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు న్యాయమూర్తిని శేష వస్త్రంతో సత్కరించగా కార్యనిర్వహణాధికారి ఆయనకు ప్రసాదాలను, జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా ఇటీవలే ఆలయాన్ని సందర్శించే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఈవో జల్లెపల్లి వెంకటరావు సూచించారు. పురుషులు ధోవతి, పంచె, కుర్తా-పైజామా లేదా ప్యాంటు, షర్టు ధరించాలని మహిళలు చీర, లంగా-వోణి (హాఫ్ శారీ) లేదా చుడీదార్తో పాటు దుపట్టా ధరించాలని సూచించారు.