• 13 minutes ago
Bear Caught in Net Set by Hunters : వేటగాళ్లు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకున్న ఓ ఎలుగుబంటి విలవిలలాడిపోయింది. అడవి పందులను పట్టుకునేందుకు అమర్చిన ఉచ్చులో నిన్న (శనివారం) రాత్రి దురదృష్టవశాత్తు చిక్కుకున్న ఎలుగుబంటి నేడు (ఆదివారం) ఉదయం వరకు ఆ వలలో నుంచి బయటికి రాలేక అల్లాడిపోయింది. చివరికి స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని కెంచంపల్లి – బెస్తరపల్లి మధ్య వేటగాళ్లు వేసిన వలలో ఎలుగుబంటి చిక్కుకుంది. అడవి పందులను పట్టుకునేందుకు వేటగాళ్లు వల ఏర్పాటు చేయగా అటుగా వచ్చిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తు ఆ వలలో చిక్కుకుంది. ఎలుగుబంటి వలలో చిక్కుకున్న విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. వలలో నుంచి ఎలుగుబంటిను విడిపించారు. వలలో చిక్కుకున్న సమయంలో ఎలుగుబంటి కాలికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో మెరుగైన వైద్యం కోసం పుట్టపర్తి అటవీ శాఖ ఆసుపత్రికి తరలించారు.

Category

🗞
News

Recommended