CAR FIRE ACCIDENT IN KURNOOL: కర్నులులో ఓమ్ని కారు అగ్నిప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. నంద్యాల చెక్ పోస్టు నుంచి కర్నూలు వైపు వస్తున్న ఓమ్ని కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి కిందకి దిగటంతో ప్రమాదం తప్పింది. మంటల కారణంగా చుట్టుపక్కలా పొగ వ్యాపించింది. ప్రమాదానికి షార్ట్ సర్య్కూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణాపాయం జరగక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద దృశ్యాలను పలువురు ఫోన్లలో రికార్డ్ చేశారు. టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం - మంటల్లో సజీవదహనమైన లారీ డ్రైవర్‌తిరుమల శేషాచల అడవుల్లో భారీగా మంటలు