Skip to playerSkip to main content
  • 3 months ago
Bibi ka Alam Procession Hyderabad : 10వ మొహర్రం సంతాప దినం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో బీబీకాఆలం నిర్వహించారు. ఏనుగు అంబారిపై డబీర్​పుర నుంచి యాత్ర మొదలైంది. ఈ కార్యక్రమం షేక్ ఫైజ్ కమాన్, అలిజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, మీర్ ఆలం మండి, పురానీ హవేలీ, దారుల్ షిఫా, ఎం.జీ.బీ.ఎస్, చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. ఊరేగింపులో షియా ముస్లిం వర్గం వారు కత్తులతో, బ్లేడ్​లతో తమ దేహంపై కొట్టుకుంటూ రక్తాన్ని చిందిస్తు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బీబీకాఆలంను చూడడానికి ప్రజలు రాష్ట్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలి వచ్చారు. చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. కిరణ్ ప్రభాకర్ ఊరేగింపులో పాల్గొన్నారు. అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఊరేగింపు సజావుగా సాగింది. ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended