Skip to playerSkip to main content
  • 1 week ago
Labrador Retriever Gives Birth to 10 Puppies : సాధారణంగా లాబ్రడార్ రిట్రీవర్ జాతి కుక్కలు ఒక కాన్పులో 5 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుంటాయి. కానీ రాజమహేంద్రవరంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దివాన్ చెరువు ప్రాంతానికి చెందిన సాల్మాన్ దేవానంద్, అనుపమ దంపతులు ఓ లాబ్రడార్ రిట్రీవర్ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆ పెంపుడు కుక్క ఆదివారం తొలి కాన్పులోనే ఏకంగా పది పిల్లలకు జన్మనిచ్చింది.పుట్టిన వాటిలో నాలుగు మగ పిల్లలు కాగా, మరో ఆరు ఆడ పిల్లలు ఉన్నాయి. ఈ పది పిల్లలు కూడా ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నాయని యజమాని సాల్మాన్ దేవానంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెంపుడు కుక్కకు ఇది తొలి కాన్పు అని ఆయన చెప్పారు. తొలి కాన్పులోనే ఇలా పది పిల్లలు పుట్టడం చాలా అరుదైన విషయమని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సత్యనారాయణ కూడా వెల్లడించారు. ఒకేసారి పది అందమైన కుక్క పిల్లలు పుట్టడంతో ఆ యజమాని కుటుంబం ఎంతో ఆనందంలో మునిగిపోయింది. ఈ లాబ్రడార్ రిట్రీవర్ కుక్కను, దాని పది పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల స్థానికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. 

Category

🗞
News
Transcript
00:25Thank you for listening.
00:30Thank you for listening.
Comments

Recommended