Skip to playerSkip to main content
  • 1 week ago
Collector Surprise Inspection of Jaggayyapeta Area Hospital : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిని నేడు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్, ల్యాబొరేటరీ, ఓపీ విభాగం, వివిధ వార్డులు, ఇతర వైద్య విభాగాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, పరీక్షలు, వైద్యుల అందుబాటు తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి పనితీరులో క్యూఆర్ స్కాన్ వినియోగం తదితర అంశాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, మందులు, వైద్య పరికరాలు తదితర ప్రయోజనాలు పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బందిపై ఉందన్నారు.

Category

🗞
News
Transcript
00:12Oh
Comments

Recommended