Skip to playerSkip to main content
  • 2 minutes ago
Heavy Rain with Thunderstorms Hits Nellore : నెల్లూరు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంతోపాటు కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. ఎల్‌నినో ప్రభావంతో ఎన్నో రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి వాతావరణం చల్లగా మారింది. అయితే ఉదయం పనులకు వెళ్లేవారు, వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి రోడ్లు జలమయంకాగా, అన్నదాతల్లో మాత్రం ఆనందాన్ని నింపింది. వర్షం నీటితో కలిసి మురుగునీరు రోడ్లపై చేరడంతో పాదచారులు అసౌకర్యానికి గురయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశమంతటా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఆశించిన మేరకు వర్షం కురవలేదు.

Category

🗞
News
Transcript
00:20Oh
00:30Let's go.
01:05I'll see you next time.
Comments

Recommended