Skip to playerSkip to main content
  • 35 minutes ago
Boy Learned play tabla Youtube in Kamereddy : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్ కాలనీలో నివాసం ఉండే సాయిరాం-స్వప్న దంపతులు చిన్న కుమారుడు పరమేశ్వర్ చిన్న వయసులోనే డోర్లపైన, ప్లేట్లపై తదితర వస్తువులపై తబలా లాగా వాయించడం మొదలు పెట్టాడు. దీంతో తండ్రి బెదిరించేవాడు. అయినప్పటికీ మానుకోకుండా అలాగే వాయించడంతో తండ్రి చివరకు ఒక తబలా సెట్ ఆ బాలుడికి అప్పగించాడు. అప్పటి నుంచి యూట్యూబ్​లో చూసి నేర్చుకుని తబలా ప్లేయర్​గా మారిపోయాడు. చదువుకుంటూనే వందలకు పైగా ప్రోగ్రాములు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. తిరుపతి, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాల్లో పరమేశ్వర్ ప్రోగ్రాములు ఇచ్చాడు. సాయిరాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పరమేశ్వర్ కామారెడ్డిలోని సరస్వతి శిశుమందిర్​లో ఏడో తరగతి చదువుతున్నాడు. యూట్యూబ్ చూసి పట్టుదలతో నేర్చుకున్నట్టు పరమేశ్వర్ తెలిపాడు. తమ కుమారుడు చదువు, తబలా నైపుణ్యం మెరుగు పరుచుకునేందుకు సాయం చేయాలని పరమేశ్వర్ తండ్రి సాయిరాం కోరుతున్నాడు.

Category

🗞
News
Transcript
00:26Thank you for joining us.

Recommended