Godavari Is Flowing Furiously At The Polavaram project : రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వరద నీటి మట్టం క్రమంగా పెరిగింది. ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద నీటి మట్టం సుమారు 33 అడుగులకు చేరింది. దాదాపు 9 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బ్యారేజీ వైపు విడుదల చేస్తున్నారు. వరద నీటిని దిగువకు పంపడానికి 48 గేట్లను పైకి ఎత్తారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 11.6 అడుగులకు చేరగా, 9.64 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి బ్యారేజీకి చెందిన 175 గేట్లను ఎత్తారు. కోనసీమ ప్రాంతంలో గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో కనకాయలంక వద్ద ఉన్న కాజ్‌వే నీట మునిగిపోయింది. దీనివల్ల నదీ దగ్గరి ప్రాంతాల్లో నివసించే ప్రజలు మోటారు బోట్ల ద్వారా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.