Skip to playerSkip to main content
  • 16 minutes ago
Flood Levels Increased in Nallamada Vagu : మురసు తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలో నల్లమడ వాగు తీవ్ర రూపం దాల్చింది. నల్లమడ వాగు, నక్కవాగుకు గండ్లు పడ్డాయి. పెదనందిపాడు, నాగులపాడు గ్రామాలతో పాటు కాకుమాను మండలం కొమ్మూరు, గార్లపాడు గ్రామాలను వరద నీరు చుట్టు ముట్టింది. పెదనందిపాడు నుంచి కొమ్మూరుకు వెళ్లే బాపట్ల ప్రధాన రహదారి పై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కట్టలకు అంచుల వరకు వాగు నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలు ఉన్నారు. పెదనందిపాడు నుంచి గుంటూరు, పర్చూరు వైపుగా వెళ్లే ప్రధాన రహదారులకు రాకపోకలు ఆగిపోయాయి. కొమ్మూరు నుంచి గార్లపాడు వెళ్లే రహదారి పై నుంచి భారీ నీరు ప్రవహిస్తోంది. రహదారులు కోతకు గురయ్యాయి. బాపట్ల జిల్లా చెరుకూరు వైపు నల్లమడ వాగు నీరు ప్రవహిస్తోంది. 

Category

🗞
News
Transcript
00:00I

Recommended