Skip to playerSkip to main content
  • 6 minutes ago
Duduma Waterfall Floods : ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో 'అర్నబ్' తుపాను ప్రభావంతో సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. భారీ వర్షాలకు జలపాతాలు ప్రాణం పోసుకున్నాయి. ప్రముఖ డుడుమ జలపాతం వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. చుట్టూ పచ్చని ప్రకృత్తి మధ్య పాల నురగలా జాలువారుతున్న జలపాతం ప్రవాహం చూసేందుకు ఎంతో రమణీయంగా కనువిందు చేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోయాయి. వరద ఉద్ధృతి పెరగడంతో జోలాపుట్, డుడుమ జలాశయాల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొండ దిగువకు చేరుకుంటే ఒకేచోట మొత్తం మూడు జలపాతాలు దర్శనమిస్తాయి. ఒకవైపు 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ప్రధాన డుడుమ జలపాతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు విద్యుత్ కేంద్రానికి చెందిన టీపీ డ్యామ్ నుంచి వచ్చే వరద నీరు, ఆంధ్రా సరిహద్దు నుంచి వచ్చే మరో చిన్న జలపాతం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. జలపాతం అందాలు ఒకవైపు ఆకట్టుకుంటున్నా, వరద ఉద్ధృతి మాత్రం భయపెడుతోంది. ప్రస్తుతం జలపాతం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పర్యాటకులను డుడుమ జలపాతం వ్యూ పాయింట్‌ వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. 

Category

🗞
News
Transcript
00:00I
00:47I don't know, I don't know, I don't know.
01:12I don't know, I don't know.
01:30I don't know, I don't know.

Recommended