Skip to playerSkip to main content
  • 13 minutes ago
Minister Vasamsetti Subhash On Boiler Incident In Tirupati : తిరుపతి జిల్లాలో  టాబ్లెట్‌ ఇండియా లిమిటెడ్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని మంత్రి వాసంశెట్టి సుభాశ్​ అన్నారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మృతుల్లో కంపెనీ ఉద్యోగులు వాసు, చిన్నమస్తాన్‌, గౌరవ్‌రేతో పాటు కూలీలు మోహన్‌, రమేశ్​ ఉన్నారని తెలిపారు. అక్టోబరు 2 సెలవు అనంతరం ఉదయం 6:30 గంటలకు బాయిలర్‌ లైట్‌-అప్‌ చేయగా 8:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని వివరించారు. బాయిలర్‌లో నీరు సరిపడా లేకపోవడమే పేలుడుకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తీవ్రంగా గాయపడిన సెకండ్‌ క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్‌ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 7న నిర్వహించిన సేఫ్టీ ఆడిట్‌లో అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారని, నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యంపై సమగ్ర విచారణకు ఆదేశించామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని, పరిశ్రమల్లో కార్మికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి వాసంశెట్టి సుభాశ్​ స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.

Recommended