Skip to playerSkip to main content
  • 4 minutes ago
Balapur Ganesh Immersion 2026 : హైదరాబాద్‌ బాలాపూర్‌ గణేశ్‌ విగ్రహం నిమజ్జనం పూర్తి అయింది. ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌ నంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. బాలాపూర్‌ గణేశ్ శోభాయాత్రలో వందలాది చిన్న గణనాథులు కలుస్తున్నాయి. మొత్తం కార్యక్రమం వైభవంగా సాగుతోంది. బాలాపూర్ గణేశ్​ శోభాయాత్ర బాలాపూర్​ నుంచి చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్-ఎంజేమార్కెట్, అబిడ్స్-లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్‌ బండ్‌ వరకు బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర 16 కిలోమీటర్లు కొనసాగింది. అంతకు ముందు ఇవాళ ఉదయం బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట పోటాపోటీగా ముగిసింది. ఏటేటా భక్తుల్లో అంచనాలను పెంచుతూ దేశ విదేశాల్లోని తెలుగువారిని ఆకర్షించే ఈ లడ్డూ వేలం పాట, ఈ ఏడాది మరింత రసవత్తరంగా సాగింది. ఈసారి నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో రూ.39 లక్షలు పలికింది. 

Category

🗞
News
Transcript
00:00Thank you so much for joining us.

Recommended