Skip to playerSkip to main content
  • 11 minutes ago
 Priyadarshi met Harish Rao : ప్రముఖ నటుడు ప్రియదర్శిని మాజీమంత్రి హరీశ్‌ రావు సన్మానించారు. ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్‌’లో ఎమ్మెల్యే శంకర్ అంటూ కేసీఆర్‌ను పోలిన పాత్రతో నటుడు ప్రియదర్శి హైలైట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ప్రియదర్శి హరీశ్ రావుని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రియదర్శి 'ఎమ్మెల్యే శంకరన్న' పాత్రను పోషించారు. ఈ పాత్ర ఆహార్యం, హావభావాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ పాత్రలో జీవించావంటూ అభినందించారు. 'ప్యారడైజ్' సినిమాపై, అందులో ప్రియదర్శి నటనపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ప్రియదర్శి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందించారు. డైైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను కూడా కేటీఆర్ అభినందించారు.

Category

🗞
News
Transcript
00:00Let's get started.
00:40Let's get started.
01:00Let's get started.

Recommended