Skip to playerSkip to main content
  • 27 minutes ago
Vangaveeti Radha Krishna Joins In Janasena : మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి రాధాను జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి రాధా బయటకు రాగానే ఆయన అనుచరులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Category

🗞
News
Transcript
00:12Oh
00:30Oh
01:02Oh

Recommended