Skip to playerSkip to main content
  • 1 week ago
Kavitha Attended Mudhiraj Marriage : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ముదిరాజ్‌ ఇంటి ఆడబిడ్డగా మారి కీసర క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన తన పార్టీ నాయకుడి వివాహాన్ని తన చేతుల మీదుగా జరిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. బాలప్రసాద్​కు సీతాఫల్ మండికి చెందిన శివాణితో వివాహం నిశ్చయం అయింది. కాగా బాలప్రసాద్‌కు సోదరిలు లేకపోవడంతో అతని కోరిక మేరకు కవితనే ఇంటి ఆడబిడ్డగా మారింది. వధువుకు వరుడు తాళి కట్టే ముందు ఆడపడుచుతో వధువు మెడలో పసుపు కొమ్ముతో మూడు ముళ్లు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాణి మెడలో పసుపుకొమ్ముతో మూడు ముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి, పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాణి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అనంతరం నూతన వధూవరుల్ని కవిత ఆశీర్వదించారు.  

Category

🗞
News
Transcript
00:28For more information, visit www.fema.org
Comments

Recommended