MP Vijay Emotional After Seeing Activists Love For His Family: రాజకీయాల్లో అవకాశవాదం కామన్. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా? ఎప్పుడు పార్టీలు మారి పదవులు దక్కించుకుందామా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే పదవుల కోసం కాకుండా తమకు ఇష్టమైన వ్యక్తుల కోసం జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. కష్టకాలంలోనూ అండగా ఉంటారు. ఎన్ని పార్టీల నుంచి అవకాశాలు వచ్చినా ఎలాంటి ప్రలోభాలకు లొంగపొకుండా తాము అనుకున్న వారి దగ్గరే ఉంటారు. అలాంటి వ్యక్తి గురించే ఎంపీ విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్టులు, బెదిరింపులు, వెన్నుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా సొంత తమ్ముడిలా తనకు తోడుగా నిలిచిన కార్యకర్త అభిమానాన్ని చూసి కంటతడి పెట్టారు. రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్లు కూడా ఇలా అండగా ఉండరంటూ ఆ కార్యకర్త చూపిన నిస్వార్థ ప్రేమను గుర్తు చేసుకుని చలించిపోయారు. తాను అతని కోసం జీవితాంతం అండగా ఉంటానని విజయ్ హామీ ఇచ్చారు.