Skip to playerSkip to main content
  • 6 minutes ago
Nasha Mukt Bharat BJP Laxman Cycle Rally : దేశంలో మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్మాణాత్మక కృషిలో యువత భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అక్షర స్ఫూర్తి, ఈగల్ ఫోర్స్ సంయుక్తంగా హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఈగల్ ఫోర్స్ ఇన్స్​పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని డివిజన్లను కలుపుతూ 7 కిలో మీటర్లు పైగా బీజేపీ శ్రేణులు ఈగల్ ఫోర్స్​తో కలిసి కె.లక్ష్మణ్ సైకిల్ నడుపుతూ యువతను డ్రగ్స్​కు దూరంగా ఉండాలని నినదిస్తూ ముందుకు సాగారు. అశోక్ నగర్ చౌరస్తాలో జరిగిన ముగింపు కార్యక్రమంలో డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఈగల్ ఫోర్స్ ఇన్స్​పెక్టర్ శ్రీనివాసులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
00:30Thank you for joining us.

Recommended