Skip to playerSkip to main content
  • 2 days ago
YSRCP EX MLA Fires On TDP Party Members : ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరు వాడీవేడిగా సాగుతోంది. కర్నూలు నగరంలోని పాతబస్తీలో ప్రచారం చేపట్టిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దురుసుగా ప్రవర్తించారు. 15వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుండగా, అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైన హఫీజ్ ఖాన్, తన వాహనం పైకెక్కి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. పోలీసులు ఆయనను వారించేందుకు ప్రయత్నించినప్పటికీ వినకుండా, ప్రజలందరూ చూస్తుండగానే రెండుసార్లు తొడగొట్టి, మీసం మేలేసి మీ అంత చూస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:09Thank you for listening.

Recommended