Yemmiganur MPTC ZPTC Polling : ఏపీ వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే 77 జడ్పీటీసీ, 2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నేడు 582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల, ఎర్రకోట, రాళ్లదొడ్డి, సిరాలదొడ్డి, గువ్వలదొడ్డి గ్రామాల్లో నాలుగు దశాబ్దాలు తర్వాత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి పట్టు ఉండడంతో 40 సంవత్సరాలు ఏకగ్రీవమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ గ్రామాల్లో ఇవాళ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓపికగా లైన్లలో నిలబడి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
Comments