Skip to playerSkip to main content
  • 4 minutes ago
102 YEARS OLD WOMAN CAST HER VOTE : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ మాజీ సర్పంచ్ మానవత్వం చాటుకున్నారు. ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న దస్తగిరమ్మ అనే 102 ఏళ్ల వృద్ధురాలికి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాయపడ్డారు. గన్నవారిపెల్లెకు చెందిన దస్తగిరమ్మ ఎంపీటీసీ, జట్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని నిశ్చయించుకుంది. అయితే వయసు రిత్యా కేంద్రానికి వెళ్లాలేని పరిస్థితి. ఇది గమనించిన గన్నవారిపెల్లెకు చెందిన మాజీ సర్పంచ్ వృద్ధురాలిని ద్విచక్ర వాహనంపై పోలింగ్ బూత్ వద్దకు తరలించారు. అనంతరం బూత్ సిబ్బంది వృద్ధురాలిని లోపలికి తీసుకెళ్లారు. ఇలా 102 ఏళ్ల వయసులోనూ దస్తగిరమ్మ ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలికి సహకరించిన మాజీ సర్పంచ్​ను పలువురు అభినందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను ఈ ఘటన చాటి చెప్పింది. అలాగే రాష్ట్రంలోని మరికొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగులను, వయసు పైబడిన వృద్ధులను పలువురు మానవత దృక్పథంతో పోలింగ్ కేంద్రాలను తీసుకువస్తున్నారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
Comments

Recommended