Skip to playerSkip to main content
  • 32 minutes ago
YSRCP Leaders Destroyed Ballot Box in Anantapur District: రాష్ట్రంలో పరిషత్​ ఎన్నికలు  వేళ వైఎస్సార్సీపీ విధ్వంసం సృష్టించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పలుచోట్ల వైఎస్సార్సీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సును ధ్వంసం చేశారు. దౌర్జన్యంగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి బ్యాలెట్‌ బాక్సును బయటకు విసిరారు. అనంతరం దాన్ని రాళ్లతో బద్దలుకొట్టారు. ఈ అరాచకాన్ని అడ్డుకున్న పోలీసులపైనా వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.ఆస్పత్రికి తరలింపు : ఇదిలా ఉండగా జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ మూకదాడికి పాల్పడింది. పోలింగ్‌ కేంద్రం బయట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో టీడీపీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన అమిలినేని యశ్వంత్‌ను ఆస్పత్రికి తరలించారు.

Category

🗞
News
Transcript
00:00What

Recommended