Centipede Appeared In Meal : సాధారణంగా, ఒక కాళ్లజెర్రి కనిపిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొందరికైతే ఇది భయాన్ని కూడా కలిగిస్తుంది. ఇక, మీరు తినే ఆహారంలోనే అటువంటి పురుగు కనిపిస్తే ఎలా ఉంటుంది? గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఎయిమ్స్ క్యాంటీన్లో ఆర్డర్ చేసిన ఆహారంలో కాళ్లజెర్రి కనిపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం, విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ఆసుపత్రి క్యాంటీన్లో పెరుగు అన్నం ఆర్డర్ చేయగా, తింటున్న సమయంలో అందులో ఒక కాళ్లజెర్రి కనిపించింది. క్యాంటీన్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో, వారు ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎయిమ్స్ క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందని రోగుల బంధువులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆహారంలో కాళ్లజెర్రి కనిపించిన ఘటన నేపథ్యంలో, అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామని అధికారులు హామి ఇచ్చారు .
Comments