• 15 minutes ago
Raiwada Reservoir Flood Water Flow :  గరిష్ట స్థాయికి రైవాడ జలాశయం నీటిమట్టం చేరుకుంది. నీటిమట్టం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అధికారులు శారదా నదిలోకి నీటిని విడుదల చేశారు. ఒక స్పిల్‌వే గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 113.80 మీటర్లకు చేరింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) అధికారులు, జలాశయం ఒక స్పిల్‌వే గేటును ఎత్తి దిగువ శారదా నదిలోకి 500 క్యూసెక్కుల వరద నీటిని విడిచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో శారదా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని డీఈఈ సత్యం నాయుడు హెచ్చరికలు జారీ చేశారు.

Category

🗞
News
Transcript
00:00What

Recommended