• 5 minutes ago
Excavation for Gupta Nidhulu at Private School : వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పురపాలక సుందరయ్య కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయటం కలకలం రేపింది. ఆ పాఠశాల కరస్పాండెంట్ మాంత్రికుడిని తీసుకొచ్చి ఆఫీసు గదిలో మూడు రోజులుగా రాత్రి వేళలో రహస్యంగా పూజలు చేస్తున్నారు. అంతేగాక విద్యార్థుల జుట్టు కత్తిరించి వెంట్రుకలు పూజకు వినియోగించుకోవడం, ఫోటోలు తీయడం చేస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. స్కూల్ ఆవరణంలోని ఆఫీసు గదిలో 12 అడుగులలోతు గుంత తీయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పాఠశాలలో గుప్త నిధుల కోసం జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని గమనించి, ఆఫీసు రూంకు తాళం వేసి వెళ్లారు. భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో మాంత్రికుని తీసుకువచ్చి క్షుద్ర పూజలు చేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో పూజకు వినియోగించే పూజా సామాగ్రి మొత్తం వెంట్రుకలు, నిమ్మకాయలతో ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే భయంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు విషయం పొక్కడంతో కరస్పాండెంట్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Category

🗞
News
Transcript
00:00What

Recommended