• 8 minutes ago
Tiruchanur Sri Padmavathi Ammavaru Karthika Brahmotsavams : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. డిసెంబరు 6 నుంచి 14 వరకు నిర్వహించనున్న కార్తిక బ్రహ్మోత్సవాలు, వాహనసేవలు, పంచమితీర్థం ఏర్పాట్లపై తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ అధికారులు, అర్చకులతో కలిసి ఈవో ఆవిష్కరించారు. దేశవిదేశాల నుంచి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా. అమ్మవారి వాహనసేవలు, దర్శనాల ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, భద్రత అంశాల్లో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు 6వ తేదీన ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు అందజేయనున్నట్లు ఈవో రవిచంద్ర తెలిపారు. 

Category

🗞
News
Transcript
00:00What

Recommended