Skip to playerSkip to main content
  • 4 hours ago
Chandra Prabha Vahana Seva during Tirumala Brahmotsavams : వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి' కలియుగంలో వేంకటాద్రిని మించిన పుణ్యధామం బ్రహ్మాండంలోనే లేదు. ఆపదలో ఉండి హరీ అని పిలవగానే కష్టాలను తొలగించే శ్రీనివాసుడిని మించిన దైవం ఇలలో లేదు. ఇకపై రాదని ప్రశస్తి. కలియుగాధిపతిగా శేషాచల నివాసిగా ఏడుకొండల వెంకన్నగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏడుకొండలవాడు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చంద్రప్రభ వాహనంపై మాఢవీధుల్లో ఊరేగుతూ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. వాహనం ముందు భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామస్మరణతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.

Category

🗞
News
Transcript
00:17I'll see you next time.
00:59I'll see you next time.
01:08I'll see you next time.

Recommended