Prabhu Deva Visits Tirumala Srivari Temple : ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన సమయంలో ఆయన మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ప్రభుదేవాకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ప్రభుదేవాను చూసి భక్తులు, అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులతో కాసేపు ముచ్చటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.మరోవైపు తిరుమల వేంకటేశ్వరస్వామిని సినీ తారలు శ్రీలీల, గౌరీ ప్రియ ఈ రోజు వేకువజామున దర్శించుకున్నారు. తల్లి స్వర్ణలతతో కలిసి శ్రీలీల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సినీ తారలతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. "వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" కలియుగంలో వేంకటాద్రిని మించిన పుణ్యధామం బ్రహ్మాండంలోనే లేదు. ఆపదలో ఉండి హరీ అని పిలవగానే కష్టాలను తొలగించే శ్రీనివాసుడిని మించిన దైవం ఇలలో లేదు. ఇకపై రాదని ప్రశస్తి.