Skip to playerSkip to main content
  • 5 hours ago
Bommala Koluvu in Shivakoti Temple: దసరా నవరాత్రులలో భాగంగా అనంతపురంలోని శివకోటి ఆలయంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. శ్రీ మహాలక్ష్మి శ్రీ పీఠం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును దర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత సమాజంలో మానవ జీవన విధానాలను తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పురాణాలు వాటి ఇతిహాసాలు, రామాయణ ఘట్టాలు ఇలా అన్ని విధానాలను తెలిపేలా బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. దసరా నవరాత్రులలో అమ్మవారు ఒక్కోరోజు ఒక అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. దేవతామూర్తుల జీవన విధానాలు తెలిపేలా ఈ బొమ్మ ల కొలువును ఏర్పాటు చేశారు. రామాయణంలో రాముడి నుంచి రావణాసురుడుని అంతం చేసే ఘట్టాలు ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మిలు, గజ ముఖ గణపతి అవతారాలు, సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలు, కుంభకర్ణుడు నిద్ర ఇలా దేవతామూర్తుల అవతరణ తెలిపే విశేషాలను బొమ్మలకు రూపంలో కొలువు తీర్చారు. మహిళలు కుటుంబ సమేతంగా బొమ్మల కొలువును వీక్షిస్తున్నారు. దసరా నవరాత్రులలో భాగంగా అనంతపురంలోని శివకోటి ఆలయంలో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో ప్రతి ఏటా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తామని శివకోటి శ్రీ మహాలక్ష్మి శ్రీ పీఠం ఆలయ కమిటీ కార్యదర్శి అమర్నాథ్ శర్మ తెలిపారు. 

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:43Thank you very much.
01:01Thank you very much.
01:51Thank you very much.
02:04Thank you very much.

Recommended