Celebrities Visited Tirumala Temple : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, నటి ఉదయభాను, నటుడు రవి ప్రకాశ్, మరాఠి దర్శకుడు యోగేష్ భోసలేలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆనంద నిలయంలో బాలాజీ దర్శనం తర్వాత సినీ ప్రముఖులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. నాదనీరాజనం వేదికపై సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారి కీర్తనలను ఆలపిస్తున్నామని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. దేవదేవుడి పిలుపు మేరకు నాదనీరాజనంపై కీర్తనలు చేసే అవకాశం కలిగిందని నటి ఉదయభాను తెలిపారు. ఈనెల 23వ తేదీన దశమి మరాఠీ చిత్రం విడుదల కానుందని శ్రీవారి ఆశీర్వాదంతో మంచి విజయం సాధించాలని కోరుకున్నట్లు నటుడు రవిప్రకాష్ తెలిపారు.