Virosh Couple Visit in Tirumala : సినీ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లి మూలవిరాట్టును దర్శించుకొని వారు మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో విజయ్ దేవరకొండ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వారితో ఫొటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కాంబోలో రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం రణబాలి. . రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సుమారు నాలుగు నిమిషాల రన్టైమ్తో ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఫుల్ మాస్ వైలెంట్‌గా ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ మాస్ విశ్వరూపం కనిపిస్తుంది.