Skip to playerSkip to main content
  • 14 minutes ago
Thella Kagitham Movie Unit Visits Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 'తెల్ల కాగితం' చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో యువ నటుడు హర్ష రోషన్, నటి నక్షత్ర, చిత్ర దర్శకుడు బండ్రెడ్డి తదితరులు ఉన్నారు. ఆలయంలోకి ప్రవేశించిన వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఆనంద నిలయంలో కొలువై ఉన్న శ్రీవారి మూలవిరాట్టును కనులారా దర్శించుకున్నారు. తమ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యలో మొక్కులను స్వామివారికి చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల నటుడు హర్ష రోషన్ మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన తమ 'తెల్ల కాగితం' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. చిన్న చిత్రాన్ని ప్రోత్సహించి, విజయం అందించిన ప్రతి ఒక్కరికీ హర్ష రోషన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.

Recommended