Skip to playerSkip to main content
  • 2 weeks ago
Snake At Guest House In Tirumala : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఒక భారీ పాము కలకలం సృష్టించింది. వకుళామాత అతిథి గృహం సమీపంలో తొమ్మిది అడుగుల పొడవున్న ఒక 'రాట్ స్నేక్' (జెర్రిపోతు పాము) కనిపించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ పామును చూడగానే సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ మాజీ ఉద్యోగి భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని, ఆ పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. శీతాకాలం ప్రారంభం కావడంతో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పాములు బయటకు వచ్చే ఘటనలు పెరిగాయి. భక్తుల భద్రత విషయంలో టీటీడీ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటోందని అధికారులు తెలిపారు. సాధారణంగా పాము అనే పేరు వినగానే ఒక రకమైన భయం కలుగుతుంది. దాన్ని చూడగానే భయంతో పరుగులు తీస్తుంటారు. పాముల పట్ల ఉండే ఈ భయానికి ప్రత్యేక వివరణ అవసరం లేదు, ఎందుకంటే విషపూరితమైన పాము కాటు ప్రాణాంతకం కావచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందడంపైనే ప్రాణాపాయం నుంచి బయటపడటం ఆధారపడి ఉంటుంది.

Category

🗞
News
Transcript
00:28Captions by Red Bee Media

Recommended