Top Heroines Visited Tirumala : నటీమణులు శ్రీలీల, గౌరీప్రియ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వీరితో గౌరీ ప్రియ కూడా జతకలవగా, వారంతా కలిసి స్వామి వారి సుప్రభాత సేవ, అర్చన సేవల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న తర్వాత, వారు గర్భాలయంలోని మూలవిరాట్టుని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం, ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీలీల, గౌరీ ప్రియలకు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత, ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ పరిసరాల్లో వీరిని చూసిన పలువురు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.అలాగే తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్రావు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం లు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు. టీటీడీ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. గోవిందుడిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.