NITI Aayog Member Visited Tirumala : నీతి ఆయోగ్ సభ్యురాలైన డాక్టర్ జోరాం అనియా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె స్వామివారికి నిర్వహించే 'అభిషేక సేవ'లో పాల్గొన్నారు. గర్భాలయం (ఆనంద నిలయం)లో స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను పొందారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతేకాకుండా స్వామివారి శేష వస్త్రాన్ని కూడా బహూకరించారు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న మీడియాతో ఆమె అనుభవాలను కెమెరా ముందు షేర్ చేసుకున్నారు. వారితో ఆమె మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో వేద మంత్రోచ్ఛారణలు, భక్తి గీతాలతో నిండిన అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి ముగ్ధురాలయ్యారని తెలిపారు. ఇది ఎంతో అద్భుతమైన, ఆధ్యాత్మికంగా పరిపుష్టం చేసే అనుభూతి అని ఆమె పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments