• 6 minutes ago
Sri Kadle Gauramm Floral Chariot Festival: అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో శ్రీకడ్లే గౌరమ్మ పూల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా బసవేశ్వరస్వామి ఆలయంలో కొలువై ఉన్న కడ్లే గౌరమ్మ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చక్కెర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూలతో అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై శ్రీకడ్లే గౌరమ్మ అమ్మవారిని కొలువుదీర్చి మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ విడపనకల్లు పుర వీధుల్లో కన్నులపండువగా ఊరేగించారు. ఈ శోభాయాత్రలో శ్రీవీరభద్రస్వామి వేషధారణలు, కళాకారుల ఖడ్గ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. 

Category

🗞
News
Transcript
00:00I don't know what to do
00:37I'm going to go.
Comments

Recommended